ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ మీషోను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు భారీ మోసానికి పాల్పడ్డారు. వీరు మీషోలో విక్రేతలు, కొనుగోలుదారులుగా వ్యవహరిస్తూ ఫేక్ అకౌంట్ల నుంచి వస్తువులను ఆర్డర్ చేసి.. మంచి వస్తువులను స్వీకరించి, వాటి స్థానంలో విరిగిపోయిన వస్తువులను కంపెనీకి రిటర్న్ చేసేవారు. ఇలా మీషో కంపెనీకి ఏకంగా రూ.5 కోట్లకు పైగా నష్టాన్ని తీసుకొచ్చారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన బెంగళూరు పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.