వైఎస్ జగన్ ప్రజల్లోకి వెళ్తే ఖచ్చితంగా ప్రభుత్వంపై వ్యతిరేకతను తీసుకొస్తారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అలర్ట్ అయింది. జగన్ కంటే ముందుగానే కూటమి ప్రజల్లోకి రావాలనేది చంద్రబాబు మాట. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని.. ప్రభుత్వం గురించి ప్రచారం చేయాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 15 నుంచి 20 మధ్యలో ప్రజల మధ్యకు కూటమి నేతలు రావాలని చంద్రబాబు చెబుతున్నారు.