ఎన్నికల ప్రచారంలో హాట్ టాపిక్‌గా 'గాడిద గుడ్డు'

16371చూసినవారు
ఎన్నికల ప్రచారంలో హాట్ టాపిక్‌గా 'గాడిద గుడ్డు'
'గాడిద గుడ్డు' సీఎం రేవంత్ సభల్లో సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా మారుతోంది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో సీఎం సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. వేదిక ఏదైనా.. గాడిద గుడ్డును హైలైట్ చేస్తూ వస్తున్నారు. నెత్తిన పెట్టుకుని మరీ ప్రజలకు పరిచయం చేస్తున్నారు. హస్తానికి ఓటేయాలని చెబుతూనే.. గాడిద గుడ్డును ప్రచారం చేస్తున్నారు. తెలంగాణకు బీజేపీ గాడిద గుడ్డు ఇచ్చిందనే వినూత్న ప్రచారానికి సీఎం రేవంత్‌ శ్రీకారం చుట్టారు.

సంబంధిత పోస్ట్