డైవర్ట్ చేయడానికే కేటీఆర్ అరెస్ట్ అంటూ డ్రామాలు: హరీశ్ రావు

51చూసినవారు
TG: కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. దీంతో కేటీఆర్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో హరీశ్ రావు మాట్లాడారు. వర్షాకాలం పంట పెట్టుబడి కోసం రైతులకు రూ.15 వేలు ఇస్తామని చెప్పి.. రూ.12 వేలే ఇస్తూ ఫెయిల్ అయ్యారు. యాసంగి పంటకు ఇచ్చే సాయం కూడా ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. దీంతో ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డి సర్కారు అందులోంచి బయటపడటం కోసమే కేటీఆర్ అరెస్ట్ అంటూ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్