టీ తాగితే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మెదడు చురుగ్గా పని చేయడంలో టీ కీలక పాత్ర పోషిస్తుంది. టీలోని యాంటీఆక్సిడెంట్లలో ఉండే పాలిఫినాల్స్.. వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపుని తగ్గిస్తుంది. టీలోని మూలకాలు క్యాన్సర్ కణాలను తగ్గిస్తాయి. రోజూ కనీసం మూడు కప్పులు టీ తాగే వాళ్లలో టైప్-2 మధుమేహం ముప్పు తగ్గుతుంది. కాకపోతే టీ మితంగా తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.