AP: వైసీపీకి పలువురు నేతలు రాజీనామాలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఓ సీనియర్ నేత వైసీపీ వైపు చూస్తుండటం హాట్ టాపిక్‌గా మారింది. కర్నూలులో జరిగిన ఓ వివాహ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శైలజానాథ్ వైసీపీ అధినేత జగన్‌ను కలిశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలోనూ జగన్ పట్ల సాఫ్ట్ కార్నర్‌తో శైలజానాథ్ మాట్లాడారు. దాంతో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే మాటలు వినిపిస్తున్నారు. జగన్ జిల్లాల పర్యటన సమయంలో శైలజానాథ్ వైసీపీలో చేరే ఛాన్సుంది.