నీళ్లు తాగితే కొన్ని తలనొప్పులు తగ్గిపోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజులో ఎదురయ్యే ఒత్తిడితో పాటు బాడీలో నీటిశాతం తగ్గితే తలనొప్పి వచ్చే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. మానవ మెదడు దాదాపు 73 శాతం నీటితోనే నిర్మితమై ఉంటుందని ఒంట్లో నీరు తగ్గినప్పుడు జరిగే పరిణామాలన్నీ తలనొప్పికి దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు. తలనొప్పిని తగ్గించుకోవడానికి రోజూ తగినంత నీరు తాగాలని సూచిస్తున్నారు.