AP: ప్రముఖ యువ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సభ్యులతో కలిసి మంత్రి నారా లోకేష్‌ను గురువారం కలిశారు. ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన టెస్టు సిరీస్‌లో ఉత్తమ ప్రతిభను కనబరిచిన ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని మంత్రి నారా లోకేష్ అభినందించారు. రాష్ట్రంలో యువ క్రీడాకారులకు నితీష్ స్ఫూర్తిగా నిలిచారని లోకేష్ అన్నారు. నితీష్‌ను మంగళగిరి చేనేత శాలువా, జ్ఞాపికతో మంత్రి సత్కరించారు.