జనవరి 19న వైకుంఠద్వార దర్శనం ముగుస్తున్నందున ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీపై ఉన్నతాధికారులతో టీటీడీ ఈవో జె.శ్యామలరావు తిరుమలలో సమీక్ష నిర్వహించారు. తిరుమల ఆలయంలో వైకుంఠద్వార దర్శనం చివరి రోజు ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీ జనవరి 17 శుక్రవారంతో ముగియనుంది. జనవరి 20న దర్శనం కోరే భక్తులకు జనవరి 19న ఎస్‌ఎస్‌డీ టోకెన్లు, ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి టిక్కెట్లు జారీ చేయట్లేదని తెలిపింది. జనవరి 20న వీఐపీ బ్రేక్, శ్రీవాణి దర్శనాలు రద్దు చేసింది.