ఏపీలోని ఉమ్మడి కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు వద్ద కోడి పందేల బరి వద్ద పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినందుకు జనసేన నేత ముప్పా గోపాలకృష్ణ (రాజా)ను జనసేన పార్టీ సస్పెండ్ చేసింది. "కోడి పందేల బరుల వద్ద ఫ్లెక్సీలు, పార్టీ జెండాలు ఏర్పాటు చేయడం జనసేన పార్టీ విధానాలకు, ప్రతిష్ఠకు భంగకరం. ఇందుకు బాధ్యులైన ముప్పా గోపాలకృష్ణను క్రమశిక్షణ చర్యల కింద పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం" అని గురువారం ఓ ప్రకటన చేసింది.