తమకు ఉద్యోగ పోస్టింగ్‌లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 2008 డీఎస్సీ అభ్యర్థులు ప్రజాభవన్ ఎదుట ధర్నాకు దిగారు. 1399మంది అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు జీవో నెంబర్ 9 తెచ్చి కేబినెట్ అప్రూవల్ చేసి కూడా సంవత్సరం గడిచిందని.. అయినా తమకు ఉద్యోగాలు ఇవ్వలేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. వెరిఫికేషన్ కోసం ఒరిజినల్స్ సర్టిఫికెట్స్ తీసుకోని 4 నెలలు అవుతుందని.. ఒరిజినల్స్ లేనందున బయట ఉద్యోగాలు కూడా చేసుకోలేకపోతున్నామని వాపోయారు.