మహిళల టీ20 ఆసియాకప్ మెగా టోర్నీలో భాగంగా నేపాల్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. 82 పరుగుల భారీ తేడాతో గెలుపొంది సెమీస్‌కు దూసుకెళ్లింది. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయకేతనం ఎగుర వేసింది. 179 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన నేపాల్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 96 పరుగులకే పరిమితమైంది. భారత ఓపెనర్లలో షెఫాలీ వర్మ 81(48) పరుగులతో నేపాల్ బౌలర్లపై విజృంభించింది.