ఆఫ్ఘనిస్థాన్‌లో 6.1 తీవ్రతతో
భూకంపం సంభవించింది. దీంతో మన దేశ రాజధాని ఢిల్లీతోపాటు ఉత్తర భారత దేశంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. ఈ క్రమంలో జనం భయాందోళనకు గురయ్యారు. ఢిల్లీ చుట్టుపక్కల ఇళ్లలోని ఫర్నీచర్ కూడా తరలించినట్లు సమాచారం. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం, గురువారం మధ్యాహ్నం 2:50 గంటలకు
భూకంపం సంభవించింది.