గుజరాత్‌లోని కచ్‌లో ఆదివారం
భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.7గా నమోదైంది. భచౌకి 21 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది.
భూకంపం వల్ల కచ్ జిల్లాలోని కడోల్, భచౌ, నెర్ బండి తదితర ప్రాంతాల్లో ప్రజలు ఆందోళన చెందారు. చాలా మంది భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
భూకంపం సంభవించిన ప్రాంతం
భారత్-పాక్ సరిహద్దులో ఉంది.
భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.