గుజరాత్‌లో భూకంపం సంభవించింది. కచ్‌లో శనివారం సాయంత్రం 4.37 గంటలకు భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై 3.8గా నమోదైంది. కచ్‌లోని దుధై సమీపంలోని నవ్‌లాఖా రాన్‌లో భూమికి 25 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైనట్లు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిస్మిక్ రీసెర్చ్ వెల్లడించింది. అయితే భూకంపం సంభవించిన సమయంలో ఎవరికీ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.