రుణ రేట్లను సవరించిన ఎస్‌బీఐ

66చూసినవారు
రుణ రేట్లను సవరించిన ఎస్‌బీఐ
రుణ రేట్లను భారత దిగ్గజ బ్యాంక్ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సవరించింది. ఎంపిక చేసిన కాలవ్యవధులకు మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్ ఫండింగ్ లెండింగ్ రేటు (MCLR)ను 10 బేసిస్‌ పాయింట్ల వరకు పెంచింది. ఓవర్‌నైట్‌ MCLR ఇప్పుడు 8% నుంచి 8.10%కు చేరుకుంది. ఒక సంవత్సరం MCLR.. 8.65% నుంచి 8.75%కు పెరిగింది. ఈ పెరిగిన MCLR రేట్లు 2024 జూన్‌ 15 నుంచి వర్తిస్తాయి. కాగా, ఒక నిర్దిష్ట రుణం కోసం ఆర్థిక సంస్థ విధించే కనీస వడ్డీ రేటును MCLR అంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్