మణిపూర్ సీఎం నివాసానికి సమీపంలో భారీ అగ్నిప్రమాదం

67చూసినవారు
మణిపూర్ సీఎం నివాసానికి సమీపంలో భారీ అగ్నిప్రమాదం
మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అత్యంత భద్రతతో కూడిన సచివాలయ సముదాయం సమీపంలోని భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ అధికారిక బంగ్లాకు కొన్ని వందల మీటర్ల దూరంలో ఉన్న బంగ్లాలో మంటలు చెలరేగి ఎగిసిపడ్డాయి. సమాచారం మేరకు 4 అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్