కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఈసీ నోటీసులు

80చూసినవారు
కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఈసీ నోటీసులు
కర్ణాటకలో కాంగ్రెస్ MLA రాజు కాగే అలియాస్ భరమ్‌గౌడ అలగౌడ కాగే ఓటర్లపై ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బెళగావి జిల్లాలోని మధభావిలో పర్యటిస్తున్న సందర్భంగా.. ‘ఈసారి మాకు ఎక్కువ ఓట్లు రాకుంటే మీ కరెంట్ కనెక్షన్లు తొలగిస్తా’ అని హెచ్చరించారు. మరో సందర్భంలో 'మోదీ చనిపోతే 140 కోట్ల మందిలో ప్రధాని కాగలవారు లేరా' అని అన్నారు. మరోవైపు ఓటర్లను బెదిరించడంపై ఈసీ నోటీసులు జారీ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్