పెన్ష‌న్ సొమ్ము జమ కాగానే డబ్బులు కట్‌

48721చూసినవారు
పెన్ష‌న్ సొమ్ము జమ కాగానే డబ్బులు కట్‌
ఏపీలో పలువురు పింఛన్‌దారుల బ్యాంక్‌ ఖాతాల్లో పెన్ష‌న్ సొమ్ము జమ కాగానే డబ్బులు కట్‌ అయ్యాయి. మైనస్‌ బ్యాలెన్స్‌ ఉన్న ఖాతాల్లో పెన్ష‌న్ జమ చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. చేతికి వస్తుందనుకున్న సొమ్ములో కొంత భాగం బ్యాంక్‌ చార్జీల రూపంలో కట్‌ కావడంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలోని తోట సాంబయ్య అనే వృద్ధుడు మూడు వేల రూపాయలకు బదులు 2662 రూపాయలే వచ్చాయని బాధితుడు వాపోయారు.

సంబంధిత పోస్ట్