ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు

234270చూసినవారు
ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మాదాపూర్ లోని కవిత ఆడపడుచు అఖిల నివాసంలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. కవిత భర్త అనిల్ బంధువుల ఇళ్లపైనా దాడులు జరుగుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే కవితను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆమె భర్తకూ నోటీసులు ఇవ్వగా.. ఆయన విచారణకు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలోనే కవిత, అనిల్ బంధువుల ఇళ్లలో సోదాలు చేస్తున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్