త్వరలోనే ఉద్యోగులకు ఆమోద యోగ్యమైన EHSను రూపొందిస్తామని మంత్రి రాజనర్సింహ తెలిపారు. 2014లో ఉద్యోగులకు, పెన్షనర్లకు, జర్నలిస్టుల కోసం హెల్త్ స్కీమ్ ప్రవేశపెడతామని ఊదరగొట్టి BRS మొండిచేయి చూపించిందని విమర్శించారు. ఇప్పుడు సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పోస్టులు పెట్టడం 'దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది' అని ఎద్దేవా చేశారు. 10ఏళ్లుగా నిద్రలో జోగిన BRS నాయకులకు ఇప్పుడు EHS గుర్తుకు రావడం విడ్డూరమని వ్యాఖ్యానించారు.