తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను ERC తిరస్కరించింది. 800 యూనిట్లు దాటితే 10 నుంచి 50 శానికి ఫిక్స్‌డ్ ఛార్జీలు పెంచేందుకు అనుమతి ఇవ్వాలని డిస్కంలు ప్రతిపాదన చేశాయి. సుదీర్ఘ చర్చల అనంతరం డిస్కంల ప్రతిపాదనను ERC తిరస్కరించింది. ఇతర రాష్ట్రాల్లో కరెంట్ ఛార్జీలు ఎలా ఉన్నాయనే వివరాలతో డిస్కంలు ఈఆర్‌సీకి తాజాగా నివేదికను అందజేశాయి. పరిశీలన అనంతరం పెంపు ప్రతిపాదనను ERC తిరస్కరించింది.