తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్తు సంస్థ కొత్తగా వ్యవసాయ పంపుసెట్ల విద్యుదీకరణ పథకాన్ని రూపొందించింది. రూ.508.95 కోట్ల విలువైన ఈ పథకానికి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం విద్యుత్తు లైన్లకు దూరంగా ఉన్న పొలాలకు ఈ పథకంలో ప్రాధాన్యమివ్వనున్నారు. ఈ పథకం కింద 25 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్ నుంచి నాలుగైదు హెచ్‌పీ పంపుసెట్లకు కనెక్షన్ ఇవ్వనున్నారు. ఒక్కో కనెక్షన్‌కు రూ.75 వేల వ్యయం కానుంది. ఒక వ్యవసాయ కనెక్షన్‌కు రైతు చెల్లించేది రూ.5 వేలు మాత్రమే. మిగిలిన రూ.70 వేలను ప్రభుత్వం రాయితీ కింద భరించనుంది.