బీజేపీపై ఆరోపణలు చేసి తనపై ఉన్న వ్యతిరేకత నుంచి తప్పించుకోవాలని సీఎం రేవంత్ చూస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్‌లోని బీజేపీ ఆఫీసులో ఆయన మాట్లాడుతూ.. "కాంగ్రెస్‌ను గెలిపించి మోసపోయామని ప్రజలు అనుకుంటున్నారు. నాపై రేవంత్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. సీఎం రేవంత్ అవగాహన లేక, అసహనంతో మాట్లాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకపోవడంతో కొన్ని కేంద్ర పథకాలు అమలు చేయలేకపోయాము" అని అన్నారు.