AP: అసభ్యకర వ్యాఖ్యలతో జైలుపాలైన నటుడు పోసాని కృష్ణ మురళి స్వల్ప అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఆయనను ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు పోసాని ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. ఆయనకు ఎకో టెస్ట్ అవసరమని, గతంలో పోసాని గుండెకు చికిత్స చేయించుకున్నారని తెలిపారు. పోసాని విజ్ఞప్తి మేరకే వైద్య పరీక్షలు నిర్వహించామని వైద్యులు పేర్కొన్నారు. గుండెకు సంబంధించిన జబ్బుతో బాధపడుతున్న పోసానిని కడప రిమ్స తరలించి చికిత్స అందిస్తున్నారు.