కర్ణాటకలోని తుమకూరులో నివాస ప్రాంతంలోకి చిరుతపులి ప్రవేశించడం కలకలం రేపుతోంది. ఓ ఇంటి ఆవరణలోకి ప్రవేశించిన చిరుత.. అక్కడ నిద్రిస్తున్న కుక్కను అమాంతం నోట పట్టుకుని పరుగులు తీసింది. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. గత కొన్ని రోజులుగా చిరుత సంచరించడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. రాత్రిపూట బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. చిరుతను పట్టుకోవాలని వారు అటవీ అధికారులకు విజ్ఞప్తి చేశారు.