రుషికొండ బీచ్ కు ఎంట్రీ టికెట్

3008చూసినవారు
రుషికొండ బీచ్ కు ఎంట్రీ టికెట్
విశాఖపట్నంలోని రుషికొండ బీచ్ కు ఇకపై ఎంట్రీ టికెట్ తీసుకోవాలని అధికారులు వెల్లడించారు. జులై 11వ తేదీ నుండి రుషికొండ బీచ్ కు రావాలంటే రూ. 20 ఎంట్రీ టికెట్ తీసుకోవాలని తెలిపారు. పదేళ్ల లోపు పిల్లలకు ఎలాంటి రుసుము తీసుకోమని చెప్పారు. ఎంట్రీ టికెట్ రుసుముతో పర్యాటకులకు తాగునీరు, టాయిలెట్లు, స్విమ్మింగ్ జోన్, ఆటస్థలం సౌకర్యాలు కల్పిస్తున్నామని, పార్కింగ్ కోసం మాత్రం అదనంగా ఫీజు ఉంటుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్