ఈపీఎఫ్‌ఓలో 19.5 లక్షల మంది చందాదార్లు

82చూసినవారు
ఈపీఎఫ్‌ఓలో 19.5 లక్షల మంది చందాదార్లు
ఈ ఏడాది మేలో ఈపీఎఫ్‌ఓలో 19.5 లక్షల మంది చందాదార్లు జతయ్యారని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అధికారికంగా పే రోల్‌(ఉద్యోగాల) డేటా విడుదల చేస్తున్న 2018 ఏప్రిల్‌ తర్వాత ఈ స్థాయిలో ఉద్యోగాలు లభించడం ఇదే తొలిసారి అని పేర్కొంది. 2023 మేతో పోలిస్తే ఈ సంఖ్య 19.62% ఎక్కువగా ఉందని తెలిపింది. 2024 మేలో కొత్తగా ఈపీఎఫ్‌ఓలో చేరిన సభ్యులు సుమారు 9.85 లక్షల మంది ఉన్నారు. 14.09 లక్షల మంది సభ్యులు ఈపీఎఫ్‌ఓను వీడి, మళ్లీ మేలో చేరారు.

సంబంధిత పోస్ట్