సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బిహార్‌లో నేడు పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో జెహనాబాద్ నియోజకవర్గంలోని దేవ్‌కురి గ్రామంలో ఓ కుటుంబంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన మిథిలేశ్ యాదవ్ తల్లి (80) మరణించింది. అయితే ఇంటి పెద్దను కోల్పోయి దుఖంలో ఉన్నా ఆ కుటుంబం తమ బాధ్యతను మరవలేదు. ఓటు హక్కు వినియోగించుకున్న తరువాతే ఆమె అంత్యక్రియలు నిర్వహించాలనుకున్నారు. వారు తీసుకున్న ఈ నిర్ణయంతో ఎంతోమందికి ఆదర్శంగా నిలిచినట్లయింది.