జనరల్ డయ్యర్‌ను చంపిన నేరంపై కోర్టులో విచారణకు హాజరైన ఉద్దమ్ సింగ్ మాటలు ప్రతి భారతీయుణ్నీ కదలిస్తాయి. 'నేను చావు గురించి భయపడటం లేదు. నేను నా దేశం కోసం మరణిస్తున్నాను. బ్రిటిష్ పాలనలో ఆకలితో అలమటించిన దేశ ప్రజల దుస్థితి నన్ను కలచివేసింది. ఆ పరిస్థితులను తూర్పారపడుతూ నేను నిరసన వ్యక్తం చేశాను. జన్మభూమి కోసం ప్రాణార్పణ కావించడంకన్నా గొప్ప గౌరవమేముంది?’ అని ఉద్దమ్ అన్నారు. జులై 31, 1940న ఉద్దమ్ ఉరికంబం ఎక్కాడు.