భారత ఆర్మీ ఏప్రిల్ 13ను ‘సియాచిన్ డే’గా జరుపుకుంటుంది. 1984లో ఈరోజున ఆపరేషన్ మెఘదూత్ ప్రారంభించి ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధభూమి సియాచిన్‌ను స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి మైనస్ డిగ్రీలలోనూ, కఠిన పరిస్థితుల్లోనూ దేశానికి రక్షణగా నిలుస్తున్న జవాన్ల త్యాగానికి ఇది సెల్యూట్. ఇవాళ సియాచిన్ గ్లేసియర్‌పై భారత జవాన్లు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తూ, దేశసేవలో తమ అంకితభావాన్ని ప్రదర్శిస్తారు.