వాలంటీర్లను తొలగించాలని న్యాయవాది ఉన్నం శ్రవణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేశారు. వాలంటీర్ల నియామకంలో అప్పటి ప్రభుత్వం రిజర్వేషన్లను పట్టించుకోలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. వైసీపీ కార్యకర్తలనే వాలంటీర్లుగా నియమించారని ఆరోపించారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.