ఆకాశంలో అద్భుత దృశ్యం కన్నులను కట్టిపడేస్తుంది. చైనాలోని షాంఘై పట్టణంలో నిర్వహించిన కళ్లు చెదిరే డ్రోన్ షో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చైనా జానపద, పురాణ హీరోలు, జంతువుల ఆకారంతో డ్రోన్ షో ఆధ్యంతం ఆసక్తికరంగా సాగింది. లక్షల మంది ప్రజలు నది ఒడ్డున నిలబడి డ్రోన్ షోను తిలకిస్తూ వీడియో తీసుకున్నారు. చైనా నిర్వహించిన ఈ డ్రోన్ షో ఆ దేశం సాంకేతిక విజ్ఞాన ప్రగతిని చాటింది. డ్రోన్ షోలో డ్రాగన్ షో ప్రత్యేకాకర్షణగా నిలిచింది.