సీఎం చంద్రబాబు కాన్వాయ్ లో భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. బుధవారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం వచ్చారు. ఆ తర్వాత గుర్తు తెలియని వ్యక్తి ఓ కారును కార్యాలయం గేటు ఎదుట పెట్టి, తాళం వేసి వెళ్లారు. సీఎం వెళ్లిపోయే సమయం అవుతుండటంతో ఆ వాహనాన్ని తొలగించాలని సిబ్బంది ప్రకటించినా ఎవరూ రాలేదు. ఆ కారును తొలిగించే ప్రయత్నం చేసిన సాధ్యం కాలేదు. చేసేదేమీలేక ఆ కారు పక్కనుంచే సీఎం కాన్వాయ్ ను పంపించారు.