కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ హత్యపై దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సీబీఐ స్టేట్‌మెంట్ పేరుతో ఓ లేఖ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అయితే, ఈ లెటర్ ఫేక్ అని సీబీఐ క్లారిటీ ఇచ్చింది. ఏసీబీ డీఐజీ కార్యాలయం నుంచి రిలీజైనట్లు ఉన్న ఈ లెటర్ వాట్సాప్‌లో చక్కర్లు కొడుతోంది. ఢిల్లీలోని సీబీఐ హెడ్‌క్వార్టర్స్ ఈ కేసును దర్యాప్తు చేస్తోందని తెలిపింది. ఈ లేఖను ప్రజలు నమ్మవద్దని పేర్కొంది.