ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికీ ఆరోగ్య బీమా తప్పనిసరి. అయితే ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో ఒకే పాలసీ కుటుంబం మొత్తానికి కవరేజ్‌ను అందిస్తుంది. కానీ బీమా కంపెనీ ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలో నిర్దిష్ట మొత్తం మాత్రమే ఇస్తుంది. ఒక వ్యక్తికి ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు బీమా కవరేజీలో కొంత మొత్తం ఖర్చు అయిపోతే.. మిగతా కవరేజీ సొమ్ము తగ్గిపోతుంది. ఇతర కుటుంబ సభ్యులకు బీమా రక్షణ తగినంత ఉండకపోవచ్చు.