స్పెయిన్‌లోని వాలెన్సియా ప్రాంతంలో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వరదల కారణంగా దాదాపు 51 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు, దక్షిణ స్పెయిన్‌లోనూ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వీధులన్నీ బురద నీటితో నిండిపోయాయి. గల్లంతయిన వారి కోసం డ్రోన్ల సాయంతో గాలిస్తున్నారు. భారీ వర్షాల ప్రభావం వల్ల వీధుల్లో కార్లు కొట్టుకుపోతున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.