ప్రముఖ సినీ నిర్మాత, జర్నలిస్టు నారీ హీరా (86) శుక్రవారం కన్నుమూశారు. స్టార్‌డస్ట్, సావీ తదితర ప్రముఖ మ్యాగజైన్ల వ్యవస్థాపకునిగా ఆయన ఎంతో పేరొందారు. బాలీవుడ్ గాసిప్‌లు, వివాదాలు, సంచలనాత్మక కథనాలను 'స్టార్ డస్ట్' మ్యాగజైన్‌లో ఆయన ప్రచురించి ‘కింగ్ ఆఫ్ ఇండియన్ మ్యాగజైన్స్’గా ఘనత సాధించారు. ఆయన 1938లో కరాచీలో ఆయన జన్మించారు. 1947లో దేశ విభజన తర్వాత ఆయన ఫ్యామిలీ ముంబైకి వచ్చి స్థిరపడింది.