సింగు బార్డర్ వద్దకు భారీగా చేరుకున్న రైతులు

53చూసినవారు
సింగు బార్డర్ వద్దకు భారీగా చేరుకున్న రైతులు
తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ పార్లమెంట్ ముట్టడికి రైతు సంఘాలు ఇవాళ ‘చలో ఢిల్లీ’ కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో సింగు బార్డర్ వద్దకు రైతులు భారీగా చేరుకున్నారు. ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఈ ఆందోళనల్లో 200 రైతు సంఘాలు పాల్గొంటున్నాయి. ఈ క్రమంలో పోలీసులు, భద్రతా దళాలు యూపీ, పంజాబ్, హర్యానాతో ఉన్న సరిహద్దుల్లో జాతీయ రహదారులను పూర్తిగా మూసివేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్