TG: ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కంటాయపాలెంకు చెందిన గడ్డం రవీందర్(34), భార్య రేణుక (28), కూతురు రిషిత(8) ఆత్మకూరు(ఎస్) మండలం, కోటపహాడ్ లో శుభకార్యానికి వెళ్లి తిరిగి ఆదివారం హైదరాబాద్ వెళ్తుండగా బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.