ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. క్యుములో నింబస్ మేఘాల ప్రభావంతో పిడుగులతో కూడిన వర్షాలతో పాటు, వడగళ్ల వాన, ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. విదర్భ నుంచి తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. వర్షాలు కురిసే సమయంలో చెట్లకు దూరంగా ఉండాలని సూచించింది.