పరీక్షకు దివ్యాంగ కూతురిని భుజంపై మోసుకెళ్లిన తండ్రి (వీడియో)

55చూసినవారు
ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఓ తండ్రి తన దివ్యాంగ కూతురిని భుజంపై మోసుకుంటూ పరీక్ష సెంటర్‌కు వెళ్తున్న ఘటన చూపరులను కలచివేస్తోంది. ఏలూరు జిల్లా కామవరపుకోటకు చెందిన విద్యార్థిని ఉజ్వలకు పోలియో సోకింది. దీంతో ఆమె నడవలేని స్థితిలో ఉండడంతో తండ్రి తన భుజంపై కూతురిని మోసుకుంటూ పరీక్ష కేంద్రానికి వెళ్లాడు. సహాయకుల సాయంతో ఆమె పరీక్ష రాయనుందని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్