‘దేవర’ నుంచి ఫియర్ సాంగ్‌ లిరికల్ వీడియో విడుదల

79చూసినవారు
జూనియర్‌ ఎన్టీఆర్ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీ రెండు పార్టులుగా విడుదల కానుండగా.. దేవర పార్టు 1 సెప్టెంబర్ 27న గ్రాండ్‌గా విడుదల కానుంది. కాగా ఈ మూవీ నుంచి విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్‌ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా మేకర్స్‌ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఫియర్‌ సాంగ్‌ లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు.

సంబంధిత పోస్ట్