TG: కేసీఆర్ జన్మదినం సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేక్ కట్ చేస్తుండగా.. కార్యకర్తల మధ్య ఒక్కసారిగా తోపులాట జరిగింది. దీంతో కేటీఆర్ అదుపుతప్పి కేక్ మీద పడబోయారు. ఇంతలో పక్కనే ఉన్న వాళ్లు కేటీఆర్‌ను పట్టుకొని, పైకి లేపారు.