సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. కారణం తెలియదు కానీ ఇద్దరు యువకుల మధ్య ఉన్నట్టుండి గొడవ మొదలైంది. అందరూ చూస్తుండగానే ఇద్దరూ ఒకరినొకరు కొట్టుకుంటూ అక్కడే ఉన్న కాలువలో పడిపోయారు. అయినా గొడవ మాత్రం ఆగలేదు. ఆ ఇద్దరూ మురుగులో మునిగి ఒళ్ళంతా కంపుకొడుతున్నా గొడవ మాత్రం ఆపలేదు. దీంతో చివరకు ఓ వ్యక్తి చిర్రెత్తుకొచ్చి.. వారి వద్దకు వెళ్లి చెక్కతో చితకబాదాడు. దీంతో ఇద్దరూ యువకులు అక్కడినుండి పారిపోయారు.