తెలుగు సినిమాల నిర్మాణంపై మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీయాలని మంత్రి సూచించారు. బందిపోట్లు, స్మగ్లర్ల బయోగ్రఫీలతో సినిమా తీయడమేంటని ఆయన ప్రశ్నించారు. సమాజంలో ఇలాంటివి మంచివి కాదని మంత్రి హితవు పలికారు. జన్మించిన ఊరు, సమాజం కోసం శ్రమించే వాళ్ల కథలను.. సినిమాలుగా తీయాలని సత్యకుమార్ సూచించారు.