గుంటూరు జీజీహెచ్‌లో లైంగిక వేధింపుల కలకలం

68చూసినవారు
గుంటూరు జీజీహెచ్‌లో లైంగిక వేధింపుల కలకలం
ఏపీలోని గుంటూరు జీజీహెచ్‌లో లైంగిక వేధింపుల కలకలం రేపింది. ల్యాబ్‌ టెక్నీషియన్‌ డిప్లొమా విద్యార్థినులను బ్లడ్‌ బ్యాంక్‌ ఉద్యోగి వేధిస్తున్నట్టు ఫిర్యాదు వచ్చింది. జీజీహెచ్‌లో శిక్షణకు వచ్చిన విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడడంతో సదరు విద్యార్థినులు గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్టు వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ సుందరాచారి తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్