బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది మృతి, 24 మందికి గాయాలు!

75చూసినవారు
బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది మృతి, 24 మందికి గాయాలు!
హరియాణాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నూహ్​ ప్రాంతంలో ఓ టూరిస్ట్​ బస్సుకు మంటలు చెలరేగాయి. శుక్రవారం అర్థరాత్రి 1:30 నిమిషాల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 24 మంది గాయపడ్డారు. బస్సులో కనీసం 60 మంది ఉంటారని సమాచారం. వీరిలో చాలా మంది మతపరమైన యాత్రలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే స్పందించిన స్థానిక పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రులు, మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్