ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలో సినీ ఫక్కీలో పోలీసులు దుండగులను ఛేజ్ చేసి కాల్చిచంపారు. గ్యాంగ్‌స్టర్ ముస్తఫా కగ్గా ముఠాకు చెందిన నలుగురు వ్యక్తులు కారులో వెళ్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారిని అరెస్ట్ చేసేందుకు వెళ్లగా, దుండగులు కారులో తప్పించుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు వారి వాహనాన్ని ఛేజ్ చేసి చుట్టుముట్టి కాల్పులు జరిపారు. ఈ క్రమంలో తీవ్ర గాయాలపాలైన నలుగురూ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.