జార్ఖండ్ ప్రభుత్వం తొలిసారిగా పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాకు చెందిన ఒక ట్రాన్స్‌జెండర్‌ను కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్‌గా నియమించింది. సీఎం హేమంత్ సోరెన్ స్వయంగా ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు. జాతీయ ఆరోగ్య మిషన్‌లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం శిక్షణ అందించి ఇటీవల 365 మందికి ఉపాధి కల్పించింది. అందులో అమీర్ మహతో అనే ట్రాన్స్ జెండర్ కూడా ఉన్నారు. ట్రాన్స్‌జెండర్లకు సీట్లు రిజర్వ్ చేయాలనే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం గత ఏడాదిలో ఆమోదం తెలిపింది.